Jeera Water Benefits: జీరా వాటర్ లేదా జీలకర్ర నీటితో కలిగే అద్భుత ప్రయోజనాలివే
Jeera Water Benefits: జీరా వాటర్ లేదా జీలకర్ర నీళ్లతో కలిగే ప్రయోజనాలు అద్భుతం. అపారం. అందుకే ప్రతిరోజూ ఓ గ్లాసు జీరా వాటర్‌తో దినచర్య ప్రారంభిస్తే కలిగే ప్రయోజనాలేంటనేది ఇప్పుడు చూద్దాం.
Jeera Water Benefits: జీరా వాటర్ లేదా జీలకర్ర నీళ్లతో కలిగే ప్రయోజనాలు అద్భుతం. అపారం. అందుకే ప్రతిరోజూ ఓ గ్లాసు జీరా వాటర్‌తో దినచర్య ప్రారంభిస్తే కలిగే ప్రయోజనాలేంటనేది ఇప్పుడు చూద్దాం.
జీలకర్ర నీరు ఎందుకు తీసుకోవాలి, ఉదయం పూట మొట్ట మొదట చేసే పని అదే ఎందుకుండాలనే విషయంపై న్యూట్రిషనిస్టులు ఏం చెబుతున్నారో పరిశీలిద్దాం. కావల్సింది రెండే రెండు. ఒకటి జీలకర్ర, రెండవది ఓ గ్లాసు నీళ్లు. గరం మసాలా దినుసులనేవి కేవలం ఆహార పదార్ధాలకు ఫ్లేవర్ మాత్రమే అందించవు. వాటిలో అంతులేని చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. బరువు తగ్గడం నుంచి మొదలుకుని..జీర్ణక్రియ, సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందుకే మందులకు బదులు కిచెన్‌లో అందుబాటులో ఉండే వివిధ రకాల దినుసులతో ఆరోగ్యంగా ఎందుకుండలేరు. ఇదే న్యూట్రిషన్లు సంధిస్తున్న ప్రశ్న.
మీకు కూడా అలాగే చేయాలన్పిస్తే..మీకు అద్భుత ప్రయోజనం కల్గించే సింపుల్ రెమిడీస్ గురించి వివరిస్తాం. స్పైసీగా ఉండే కిచెన్ దినుసులు ఆరోగ్యానికి చాలా మంచివి. ఉదయం పూట ప్రతిరోజూ జీలకర్ర నీళ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. జీలకర్ర నీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. జీర్ణక్రియకు దోహదపడతాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. భాడీ మెటాబాలిజంను పెంచుతాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి, యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు కలిగి..రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
జీలకర్ర నీరు ఎలా చేయాలి
ఓ కప్పు నీటిలో కొద్దిగా జీలకర్ర నానబెట్టాలి. కాస్సేపు నానబెట్టిన తరువాత వడపోసి..ఆ గింజలకు వేడి నీరు కలపాలి. వేడి నీటిలో ఎక్కువ సేపు ఉండటం ద్వారా జీలకర్ర గింజలు బాగా ఉబ్బి..నీటిలోకి బయో యాక్టివ్ కాంపౌండ్స్ విడుదల చేస్తాయి. రోజూ క్రమం తప్పకుండా జీరా వాటర్ (Jeera Water) తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శ్వాసకోశం శుభ్రంగా ఉంటుంది. గొంతు గరగర లేదా పొడి దగ్గు వంటివి దూరమౌతాయి.
Also read: Side effects of Grapes: అంగూర పండ్లకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.