Zycov D Vaccine: దేశంలో చిన్నారులకు త్వరలో వ్యాక్సిన్ అందనుంది. తొలి చిన్నారుల వ్యాక్సిన్‌గా ప్రపంచంలోని మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌గా భావిస్తున్న ఆ కంపెనీ వ్యాక్సిన్ మార్కెట్‌లో రానుంది. కంపెనీ వ్యాక్సిన్ ధరను కూడా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వ్యాక్సినేషన్(Corona Vaccination)ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్యంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ చిన్నారులకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో రాలేదు. కోవాగ్జిన్ చిన్నారులకిచ్చే విషయం ట్రయల్స్ పూర్తి చేసుకుని..డీసీజీఐ(DCGI)అనుమతి కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్, గుజరాత్‌కు చెందిన క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డి వ్యాక్సిన్ త్వరలో మార్కెట్‌లో రానుంది.


ప్రసిద్ధ జైడస్ క్యాడిలా దేశీయంగా రూపొందించిన కరోనా జైకోవ్ డి వ్యాక్సిన్‌కు(Zycov D Vaccine) ఓ ప్రత్యేకత ఉంది. చిన్నారులకు అంటే 12-18 ఏళ్లలోపున్నవారికిచ్చేందుకు వీలుగా వ్యాక్సిన్ అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. అంతేకాకుండా ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌గా ఉంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు రెండు డోసులైతే..జైకోవ్ డి వ్యాక్సిన్ మూడు డోసులు ఇవ్వాల్సి వస్తుంది. జైడస్ క్యాడిలా సంస్థ..జైకోవ్ డి వ్యాక్సిన్ ధరను ప్రకటించింది. వ్యాక్సిన్ మూడు డోసులు కలిపి 19 వందల రూపాయలుగా నిర్ణయించింది. జైడస్ క్యాడిలా(Zydus Cadilla)సంస్థతో కేంద్రం ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు కొలిక్కి వస్తే వ్యాక్సిన్ ధర మరింత తగ్గే అవకాశాలున్నాయి. ఈ వ్యాక్సిన్‌కు ఉన్న మరో ప్రత్యేకత టీకా అంటే ఇంజక్షన్ ద్వారా కాకుండా జెట్ ఇంజెక్టర్‌తో ఇస్తారు. ఫలితంగా నొప్పి ఉండదు. ఇంజక్ఠర్ ధర 30 వేలు కాగా..ఒక్కొక్క ఇంజక్ఠర్‌తో20 వేల డోసులిచ్చేందుకు అవకాశముంటుంది. వ్యాక్సిన్ మార్కెట్‌లో ప్రవేశించాక...ముందుగా 12-18 ఏళ్లవారికి ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయమై జాతీయ నిపుణుల బృందం సూచనలు జారీ చేయనుంది. జైకోవ్ డి వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చిన 28 రోజుల తరువాత రెండవ డోసు, 56 రోజుల అనంతరం మూడవ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 


Also read: National Digital Health Mission 2021: ఇక ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు, ఎలా పొందాలంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి