Zycov D Vaccine: ఇండియాలో రెండవ మేకిన్ ఇండియా వ్యాక్సిన్ జైకోవ్ డి నుంచి కీలక ప్రకటన వెలువడింది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన కోవిడ్ 19 వ్యాక్సిన్ ధరను తగ్గిస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో త్వరలో మరో వ్యాక్సిన్ వచ్చి చేరనుంది. ఇప్పటి వరకూ మేకిన్ ఇండియా వ్యాక్సిన్ భారత్ బయోటెక్(Bharat Biotech)అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute)ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, రష్యన్ కంపెనీ అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ జైకోవ్ డి అందుబాటులో రానుంది. వ్యాక్సిన్ ధర విషయంలో నెలకొన్న సందిగ్దత తొలగింది. జైకోవ్ డి ధరను(Zycov D Price)తగ్గించేందుకు ఆ సంస్థ అంగీకరించింది.


జైడస్ క్యాడిలా(Zydus Cadila)సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డి కోవిడ్‌–19 వ్యాక్సిన్ ధరను తగ్గించేందుకు సంస్థ అంగీకరించింది. ఒక్కో డోసును 265 చొప్పున విక్రయిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు జైడస్‌ క్యాడిలా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే వ్యాక్సిన్ ధరపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ వారంలోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. 12 ఏళ్లు పైబడిన  వారికోసం జైడస్‌ క్యాడిలా సంస్థ జైకోవ్‌ డి పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వ ఔషధ నియంత్రణ సంస్థ(DCGI)నుంచి అనుమతి లభించింది. దేశంలో 12 ఏళ్లు పైబడిన వారి కోసం అనుమతి లభించిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. జైకోవ్‌ డి వ్యాక్సిన్‌కు(Zycov D Vaccine)సూది అవసరం లేదు. డిస్పోజబుల్‌ పెయిన్‌లెస్‌ జెట్‌ అప్లికేటర్‌ ఉపయోగించాల్సి ఉంటుంది. దీని ధర 93 రూపాయలుంటుంది. ఒక్కో డోసుకు ఒక్కొక్క అప్లికేటర్‌ కావాలి. దీంతో ఒక్కో డోసు ధర మొత్తం 358 రూపాయలకు  చేరింది. జైకోవ్‌ డి టీకాను మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. మూడు డోసులను 19 వందలకు విక్రయిస్తామని..జైడస్ క్యాడిలా గతంలోనే తెలిపింది. ప్రభుత్వంతో చర్చల అనంతరం ఒక్కొక్క డోసు 358 రూపాయలకు విక్రయించేందుకు అంగీకారం తెలిపింది. 


Also read: Covid19 Vaccination: కరోనా సంక్రమణను ఆపని వ్యాక్సినేషన్, తాజా అధ్యయనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి