Zycov D Vaccine: దేశంలో తొలి చిన్నారుల వ్యాక్సిన్, మేకిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్‌లో వచ్చేస్తోంది. సెప్టెంబర్ నెలాఖరుకు పంపిణీ ప్రారంభం కావచ్చని అంచనా. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం కేవలం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, అందులో ఒకటి మాత్రం మేకిన్ ఇండియా వ్యాక్సిన్(Make in India vaccine). మరో రెండు వ్యాక్సిన్‌లకు డీసీజీఐ అనుమతి లభించినా ఇంకా మార్కెట్‌లో రాలేదు. అయితే చిన్నారులకు ఇవ్వగలిగే వ్యాక్సిన్ ఇప్పటి వరకూ అందుబాటులో రాలేదు. తొలి చిన్నారుల వ్యాక్సిన్ మేకిన్ ఇండియాగా అందుబాటులో వస్తోంది. ఇప్పటికే డీసీజీఐ అనుమతి తీసుకుని ఉత్పత్తి ప్రారంభించింది. జైడస్ క్యాడిలా సంస్థ అభివృద్ధి చేసిన జైకోవ్ డి(Zycov D Vaccine) తొలి చిన్నారుల వ్యాక్సిన్‌గా నిలవనుంది. 


జైకోవ్ డి వ్యాక్సిన్ మిగిలిన వ్యాక్సిన్ల కంటే భిన్నమైంది. అన్ని వ్యాక్సిన్లు రెండు డోసులుంటే..జైకోవ్ డి మూడు డోసుల్ని కలిగి ఉంది. ఇది నీడిల్ ఫ్రీ వ్యాక్సిన్ కావడం విశేషం. మరోవైపు చిన్నారులకు అంటే 12 ఏళ్లు పైబడినవారికి కూడా ఇవ్వదగిన తొలి వ్యాక్సిన్ ఇదే. 12-18 ఏళ్లలోపు చిన్నారులపై కూడా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. సెప్టెంబర్ చివరికి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుందని జైడస్ క్యాడిలా(Zydus Cadilla) సంస్థ వెల్లడించింది. అక్టోబర్ నాటికి కోటి డోసుల్ని, జనవరి నాటికి 4-5 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేయగలమని సంస్థ భావిస్తోంది. దేశం వెలుపల కూడా ఇతర కంపెనీలతో కలిసి భారీగా ఉత్పత్తి చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. ప్రపంచంలోనే మొదటి డీఎన్ఏ వ్యాక్సిన్‌గా (World first Dna vaccine) జైకోవ్ డి పేరుగాంచింది. ఏడాదికి 10-12 కోట్ల డోసుల్ని తయారు చేయాలనేది కంపెనీ లక్ష్యంగా ఉంది. 


Also read: India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook