India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ

India Corona Update: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరగకపోయినా..తగ్గుదల మాత్రం కన్పించడం లేదు. మరోవైపు కరోనా నియంత్రణకై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 22, 2021, 07:57 AM IST
India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ

India Corona Update: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరగకపోయినా..తగ్గుదల మాత్రం కన్పించడం లేదు. మరోవైపు కరోనా నియంత్రణకై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)సృష్టించిన విపత్కర పరిస్థితుల్నించి దేశం దాదాపుగా కోలుకున్నా..కేసుల సంఖ్య మాత్రం పూర్తిగా తగ్గలేదు. రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్య ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా కొత్త కేసులు రోజుకు 35-38 వేల మధ్యలోనే ఉంటున్నాయి. గత 24 గంటల్లో కూడా దేశంలో 34 వేల 457 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 3 కోట్ల 23 లక్షల 93 వేల 286 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో 3 లక్షల 61 వేల 340 మాత్రమే ఉంది. గత ఆరు నెలల్లో ఇదే కనిష్టం. మొత్తం కేసుల్లో కరోనా యాక్టివ్ కేసులు 1.12 శాతంగా ఉంది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా దేశంలో 375 మంది మృతి చెందగా..ఇప్పటి వరకూ ఆ సంఖ్య 4 లక్షల 33 వేల 964గా ఉంది. 

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 17 లక్షల 21 వేల 205 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేశారు. కరోనా టెస్ట్ పాజిటివ్ రేటు 1.98 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటి వరకూ 50 కోట్ల 45 లక్షల 76 వేల 158 కరోనా నిర్దారణ పరీక్షలు జరిగాయి. దేశంలో ఇప్పటి వరకూ 3 కోట్ల 15 లక్షల 97 వేలమంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 97.54 శాతంగా ఉంది. అటు మరణాల శాతం 1.34 గా ఉంది. ఇప్పటి వరకూ దేశంలో 57 కోట్ల 61 లక్షలమందికి వ్యాక్సిన్ ఇచ్చారు. 

Also read: West Bengal Violence: పశ్చిమ బెంగాల్ హింసపై సీబీఐ విచారణ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News