Hyderabad Metro Rail: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్‌కి మెట్రో రైలు
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందనే విషయాన్ని సర్కారు దృష్టికి తీసుకొచ్చారు.
Hyderabad Metro Rail: హైదరాబాద్: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ సమీపంలోని అబ్ధుల్లాపూర్ మెట్ వరకు మెట్రో రైలు మార్గాన్ని పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుండి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉందన్న కోమటిరెడ్డి.. నిత్యం ఎంతోమంది ప్రయాణికులు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రో రైలు ఎక్కాల్సి వస్తోందన్నారు. హయత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇది చాలా కష్టంగా మారిందని కోమటిరెడ్డి వెంకటే రెడ్డి తెలిపారు. సాధారణ ప్రజలకు ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్లేవారికి చాలా అసౌకర్యం కలుగుతోందని.. ఇక్కడ మెట్రో రైల్ మార్గాన్ని పొడిగించే యోచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడానికి ముందుకు రావడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కోమటిరెడ్డి విమర్శించారు.
రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే మోతాదులో పెరుగుతూ వస్తున్నాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పైగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు. దీంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గంలోని జాతీయ రహదారిని కేంద్రం 6 లేన్లుగా మారుస్తోంది. రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది. అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్.. ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని తెలంగాణ సర్కారు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరిస్తే.. ఇక్కడి నుంచి నగరం నలువైపులా రాకపోకలు సాగించే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉంది అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందన్న ఆయన.. ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభి వృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి గతంలోనే తాను ఓ లేఖ రాశానన్నారు.
ఇది కూడా చదవండి : Food Processing Units In Telangana: తెలంగాణలో రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్
తాను రాసిన లేఖపై హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ ఆ లేఖను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖకు పంపించారని.. కేంద్రానికి తాను రాసిన లేఖను, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్వార్డ్ చేసిన మరోసారి మీకు పంపుతున్నానని తన లేఖలో పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి వీలైనంత త్వరగా మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని కోరుతున్నాను అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి : Electricity Dept Issues: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లతో ప్రమాదం పొంచి ఉంటే ఈ నెంబర్లలో ఫిర్యాదు చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి