Cinematica Expo:  సినిమాటికా ఎక్స్ పో.. భాగ్యనగరంలో ఈ నెల 16, 17వ తేదిల్లో జరిగింది.  ఈ కార్యక్రమానికి కేంద్ర ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఎస్. కృష్ణన్, తెలంగాణ ప్రభుత్వ ITE&C మరియు పరిశ్రమలు, వాణిజ్యం ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సహా పలువురు సినీ, రాజకీయ  ప్రముఖులు హాజరయ్యారు.'సినిమాటికా ఎక్స్‌పో'లో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఆవిష్కృతం అయ్యాయి. టాలెంట్ కు  పట్టం కడుతూ పలు అవార్డులు అందించడంతో పాటు, యూత్ టాలెంట్ కు  సూచనలు ఇస్తూ చర్చోపచర్చలు జరిగాయి. అలాగే ఒక గొప్ప పుస్తకావిష్కరణకు కూడా 'సినిమాటికా ఎక్స్‌పో' వేదికైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కార్యక్రమానికి ప్యాన్ ఇండియా  సినీ దర్శక దిగ్గజాలు రామ్ గోపాల్ వర్మ, సందీప్ రెడ్డి వంగాలతో పాటు సినిమాటోగ్రఫర్  కె.కె. సెంథిల్ కుమార్ సహా పలువురు ప్రముఖలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుదీప్ ఛటర్జీ, సత్యాంశు సింగ్, ఇంద్రగంటి మోహన కృష్ణ వంటి వారు తమ ప్రసంగాలతో అక్కడి వారిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా  స్టోరీ టెల్లింగ్, సినిమాటోగ్రఫీ, సినిమాల్లో సాంకేతిక అంశాలు ఎలా పురోగతి సాధించాయనే  అంశాలపై చర్చించారు.


సినీ పరిశ్రమలోని దిగ్గజాలు హీరోలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణలు..వర్ధమాన ప్రతిభావంతుల సేవలను గుర్తించి, సుధీర్ బాబు, పి.జి. విందా చేతుల మీదుగా వివిధ విభాగాలలో అర్హులైన వారికి పురస్కారాలను అందజేశారు. తెలుగు సహా  తెలంగాణ భాష,  సాంస్కృతిక శాఖ మద్దతుతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్లకు నివాళులు అర్పిస్తూ 'విజువల్ స్టోరీ టెల్లర్స్' అనే పుస్తకాన్ని పి.జి. విందా ఆవిష్కరించారు.


అలాగే, ఈ సందర్భంగా సుంటెక్ ద్వారా ట్రూజోన్ సోలార్ అందించిన 'తెలుగు DMF క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్ 2024' అనేది దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద డిజిటల్ టాలెంట్‌ వేడుకలా నిలిచింది. రెండు మిలియన్లకు పైగా ఆన్‌లైన్ ఓట్లతో.. ఫ్యాషన్, టెక్, ఫుడ్ సహా వివిధ రంగాలలో అద్భుతమైన కంటెంట్ క్రియేటర్స్ ను  గుర్తించి 15 విభాగాల్లో పురస్కారాలను ప్రధానం చేశారు. అద్భుతమైన ప్రదర్శనలు, ఆలోచింపజేసే ప్రసంగాలు, ప్రోత్సాహం కలిగించే అవార్డు కార్యక్రమాలతో  'సినిమాటికా ఎక్స్‌పో' ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తెలంగాణను సినిమాతో పాటు, డిజిటల్ క్రియేటివిటీకి కేంద్రంగా మలచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు 'సినిమాటికా ఎక్స్‌పో' నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter