Congress vs Harish Rao: తెలంగాణలో రోజురోజుకు రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి.అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు మారుతున్నాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయాలు తారా స్థాయికి చేరాయి. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలంటూ బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ ను తూర్పారబడుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పై విరుచుకుపడుతుంది. ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే, రేవంత్ అండ్ టీం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావులను ఫిక్స్ చేయాలనుకుంటుంది. ఈ పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పలు కీలక నిర్ణయాలపై సమీక్షలు నిర్వహిస్తుంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వేల కోట్లు అవనీతికి పాల్పడ్డారంటూ  ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. అంతే కాదు కాళేశ్వరం,ఫార్ములా ఈ రేస్ వంటి వాటిపైనా విచారణకు కూడా ఆదేశించింది. వీటిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ను విచారించడం ఖాయం అన్నట్లుగా ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇది ఇలా ఉంటే మరో కీలక అంశం ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కూడా రోజుకో మలుపు తిరుగుతుంది. ఇదే కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు జైలు జీవితం అనుభవిస్తున్నారు. దీని వెనుక కూడా బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారంటూ కాంగ్రెస్ నుంచి  పెద్ద ఎత్తున లీకులు వస్తున్నాయి.మొన్నటి వరకు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ తిరిగిన ఈ అరెస్ట్ రాజకీయాలు ఇప్పుడు హరీష్‌ రావును తాకాయి.


గత వారం పది రోజులగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ ను టార్గెట్ చేసినట్లు కనపడుతుంది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ మంత్రి హరీష్‌ రావు పేరును కాంగ్రెస్ తెరమీదకు తేవడం రాజకీయంగా సంచలనంగా మారింది.సిద్దిపేట్ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌండ్ హరీష్‌ రావుపై పంజాగుట్ట పీఎస్ ఫిర్యాదు చేయడం రాజకీయంగా కలకలంగా మారింది.ఐతే కాంగ్రెస్ ఇలా ఉన్నట్లుండి హరీష్‌ రావును టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏంటా అని ఆరా తీసే పనిలో బీఆర్ఎస్ ఉంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ను హరీష్‌ రావు ముప్పుతిప్పలు పెడుతున్నారు. 


 రుణమాఫీ, హైడ్రా, మూసీ విషయంలో ఏకంగా  సీఎం రేవంత్ రెడ్డికి వరుసగా సవాళ్లు విసురుతూ రాజకీయంగా కొరకరాని కొయ్యగా మారారు. తెలంగాణ రాజకీయాల్లో హరీష్ రావుకు క్లీన్ ఇమేజ్ ఉందని రాజకీయ పరిశీలకుల మాట. హరీష్‌ రావు తీరుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని రేవంత్ సర్కార్ గుర్తించింది. దీంతో ఎలాగైనా హరీష్‌ రావు దూకుడుకు కళ్లెం వేయాలని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ రావు పేరు తెరమీదకు తెచ్చారనేది హరీష్‌ అనచరుల మాట.ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనను ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టాలనుకుంటుందని గ్రహించిన హరీష్‌ రావు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో హరీష్‌ రావుకు కొంత మేర ఊరట లభించింది. ఐనా రేవంత్ సర్కార్ హరీష్‌ రావును రాజకీయంగా దెబ్బతీయాలని వ్యూహాలు పన్నుతుంది.


హరీష్ రావు మాత్రం కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్నారు. రాజకీయ కక్షలో భాగంగా తనను రేవంత్ సర్కార్ లక్ష్యం చేసుకుందని హరీష్‌ రావు అంటున్నారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే కాంగ్రెస్ ఇలా అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి మాట. కాంగ్రెస్ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పోరాడడం మానను అని హరీష్‌ రావు కాంగ్రెస్ ను హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ట్రబుల్ షూటర్ గా ఉన్న హరీష్‌ రావుకు ఇప్పుడు కాంగ్రెస్ ట్రబుల్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తుంది. మరి కాంగ్రెస్ సర్కార్ ట్రబుల్స్ ను హరీష్‌ రావు ఎలా ఎదుర్కొంటారనేది మాత్రం వేచి చూడాలి.


Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.