Hyderabad Rains: మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు... హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్..
Hyderabad Rains: రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Rain alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నగరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
శుక్రవారం హైదరాబాద్ తోపాటు సిద్ధిపేట, రంగారెడ్డి,, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నాలుగు రోజులపాటు ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు జనగామ, కామారెడ్డి, ఖమ్మం, మలుగు, నాగర్ కర్నూల్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
భాగ్యనగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 040-21111111, 9000113667 సంప్రదించాలని అధికారులు సూచించారు. ఇప్పటికే పలు కాలనీల్లో వరదనీరు ముంచెత్తింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది.
Also Read: Revanth Reddy Satires on KCR, KTR: కేటీఆర్‌కి ఆ మాత్రం తెలియదా.. రేవంత్ రెడ్డి సెటైర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook