Madhapur:  హైదరాబాద్ లో ఓ పక్కకు ఒరిగిన  భవనం ఘటన కలకలం రేపుతోంది. ఈ బిల్డింగ్ లో 48 మంది దాకా అద్దెకు ఉంటున్నారు. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో గోడ కూలినట్లు శబ్దం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోతుండటంతో..స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిల్డింగ్‌లో ఉన్న వాలంతా కిందకు వచ్చేశారు. మూడో అంతస్తులో ఉండే సాదిక్‌ హుస్సేన్‌ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ లోగా అందరూ కిందకు వచ్చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భవనం నిర్మించినట్లు తెలుస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ భవనం పక్కనే  1605, 1638 ప్లాట్లను కలిపి భవనం నిర్మించేందుకు పిల్లర్లు వేయడానికి గుంతలు తవ్వారు. వీటితో భవనానికి ఇబ్బంది వస్తుందని ఈ భవన యజమాని వారిని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. దీనివల్లే ఈ భవనం పరిస్థితి ఇలా మారిందని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్‌ జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, శేరిలింగంపల్లి టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీ వెంకటరమణ, మాదాపూర్‌ ఏసీపీ శ్రీకాంత్, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పరిశీలించారు.


పక్కకు ఒరిగిన భవనం చుట్టూ ఉండే పది భవనాల్లో నివాసం ఉండేవారిని ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించి వేరేచోటికి తరలించారు. ఈ భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. భవనాన్ని ఇంజనీర్లు పరిశీలించి నాణ్యతను నిర్ణయిస్తారని, వారి నివేదిక ఆధారంగా ఒరిగిన భవనాన్ని తొలగిస్తామని ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఈ భవనం వెనుక లోతైన గుంతలు తీసిన బిల్డర్‌పైనా చర్యలు తీసుకుంటామన్నారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter