Political pada yatra: ప్రజా సమస్యల ఎజెండాగా ఏపీ, తెలంగాణలో నేతలు ప్రజాక్షేత్రంలో బిజీ కాబోతున్నారు. రాష్ట్రం నలువైపులా పర్యటించి ప్రజలు పడుతున్న బాధలు తెలుసుకోవాలనే లక్ష్యంలో నేతలు పాదయాత్రకు సిద్దమవుతున్నారు. గత కొద్దేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్రతోనే నేతలు పవర్ లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు పాదయాత్రను పవర్ పుల్ యాత్రగా భావిస్తున్నారు. అసలు ఈ పాదయాత్రను ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఏపీలో సుదీర్ఘ పాదయాత్రను చేట్టారు. చేవెళ్ల నుంచి ప్రారంభమైన శ్రీకాకుళం జిల్లా ఇఛ్చాపురం వరకు వైఎస్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఆ అంశాలు చేర్చి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో వైఎస్ యాత్ర సాగింది. ఈ యాత్ర తర్వాతే వైఎస్ అధికారంలోకి వచ్చారు. వైఎస్ చేపట్టిన ఈ పాదయాత్ర దేశ వ్యాప్తంగా పెద్ద ట్రెండ్ నే సెట్ చేసింది. సుమారు రెండు నెలల పాటు 1500 కి.మీ పాదయాత్రను వైఎస్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా వైఎస్ తరువాత చాలా మంది నేతలు కూడా ఈ పాదయాత్ర సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సైతం గతంలో పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. సుమారు 2800 కిమీకు పైగా బాబు పాదయాత్ర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ తరువాత చంద్రబాబు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. మీ కోసం అంటూ చంద్రబాబు అప్పుడు పాద యాత్రను చేపట్టి ప్రజల వద్దకు వెళ్లారు. పాదయాత్ర అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు కూడా విజయం సాధించి అధికారంలోకి రావడం విశేషం.


ఇక వైఎస్ వారసుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్రను చేపట్టారు. దాదాపు సంవత్సరం పాటు జగన్ మోహన్ రెడ్డి ప్రజల మధ్య ఏపీ అంతటా కవర్ అయ్యేలా పాదయాత్ర చేశారు. జగన్ చేపట్టిన పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్ర అని నామకరణం చేసి ఏపీ జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అంతే కాదు పాదయాత్రలో భాగంగా వందలాది సభలు కూడా జగన్ నిర్వహించడం జగన్ రాజకీయంగా బాగా కలిసి వచ్చింది. ఎన్నికలకు సంవత్సరంన్నర ముందు ప్రారంభమైన జగన్ ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వచ్చింది. జనాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాంక్ తరువాతనే జగన్ నవరత్నాలు అని మేనిఫెస్టోను కూడా ప్రకటించారు. పాదయాత్ర తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి రికార్డు విజయాన్ని అందుకున్నారు.టీడీపీనీ చిత్తుగా ఓడించి 151 సీట్లు జయకేతనం ఎగరవేశారు.


ఇక వైఎస్, చంద్రబాబు,జగన్ తర్వాత తెలంగాణలో కూడా ఈ పాదయాత్ర సెంటిమెంట్ కంటిన్యూ అయ్యింది.ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రను చేపట్టారు. రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంఘీభావంగా హత్ సే జోడో యాత్ర అంటూ సుమారు రెండు నెలల పాటు తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేపట్టారు. ఒక రకంగా ఇది రేవంత్ రెడ్డి రాజకీయంగా , వ్యక్తిగతంగా బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ పాదయాత్ర ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో ప్రధాన భూమిక పోషించిందని చెప్పాలి. ఈ యాత్ర ద్వారానే రేవంత్ రెడ్డిని కేసీఆర్ కు ఆల్టర్ నేట్ గా చేసిందని రాజకీయ విశ్లేషకుల మాట. 


ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా త్వరలో పాదయాత్రను చేపట్టాలని డిసైడ్ అయ్యారు.తెలంగాణ వచ్చిన తర్వాత దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎన్నికల తర్వాత కేటీఆర్ పార్టీనీ లీడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేస్తానని అధికారికంగా కేటీఆర్ ప్రకటించడంతో అందరి కళ్లు కేటీఆర్ పాదయాత్రపైనే ఉన్నాయి. కేటీఆర్ పాదయాత్ర ఎలా ఉండబోతుంది..? పాదయాత్రలో భాగంగా కేటీఆర్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.


మరోవైపు కేటీఆర్ పాదయాత్రపై బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన వాళ్లు అందరూ సక్సెస్ అయ్యారు. అంతే కాదు పాదయాత్ర తర్వాత పార్టీలో భారీ విజయం సాధించి పాదయాత్ర చేసిన వాళ్లే సీఎంగా అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన కేటీఆర్ కు కూడా ఈ సెంటి మెంట్ వర్కవుట్ అయితే సీఎం అవడం పక్కా అని తెలంగాణ భవన్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఏపీలో కూడా జగన్ మోహన్ రెడ్డి మరో సారి  పాదయాత్రకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో  ఘోర పరాభవాన్ని చవిచూసిన జగన్ మళ్లీ పాదయాత్రనే నమ్ముకున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్, జగన్ మాత్రమే కాదు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని తెలంగాణ బీజేపీలో చర్చ జరుగుతుంది.


మొత్తానికి ఈ పాదయాత్ర సెంటిమెంట్ పై నేతలు తెగ ఆశలు పెట్టుకుంటున్నారు. పాదయాత్ర చేసిన వాళ్లు అందరూ సీఎం అవుతుండడంతో తాము కూడా సీఎం అవడం ఖాయమని పాదయాత్రకు సిద్దమవుతున్న నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఈ నేతల పాదయాత్రలు ఎప్పుడు ప్రారంభమవుతాయి..? పాదయాత్రల్లో జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది..? పాదయాత్ర సెంటిమెంట్ తో సీఎం అవుతారా అనేది మాత్రం తేలిది ఫ్యూచర్ లోనే..!


Also read: AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.