Revanth Reddy Pressmeet: చేరికలపై అప్పుడే ఊహాగానాలొద్దు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Pressmeet: చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
Revanth Reddy Pressmeet: దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ సొంత వ్యవహారంలా చేస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది ప్రజలకు అసౌకర్యంగా మారిందని.. దీన్ని ఖండించాలన్నారు. గ్రామస్థాయి నుంచి అధికారులందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చేరికలపై ఊహాగానాలు వద్దు.. చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక.. మేమే అధికారికంగా ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో పాటు ఇంకొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని వార్తలొస్తున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి.
హైదరాబాద్ గాంధీ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ గా షబ్బీర్ అలీ బాధ్యత వహిస్తారన్నారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయని.. 10 రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్ చేస్తోన్న పార్టీ సొంత కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిపోయిందని ఫైర్ అయ్యారు. పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయిందని దుయ్యబట్టారు. గ్రామ స్థాయి నుంచి అధికారులు అందరూ బీఆర్ఎస్ సేవలో మునిగిపోయారని ధ్వజమెత్తారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదన్న రేవంత్ రెడ్డి.. ఈ ఉత్సవాలను దశాబ్ద కాలం పాటు జరిగిన దగాగా అభివర్ణించారు.
బీఆర్ఎస్ పార్టీ ఈ పదేళ్ల పాటు చేసిన మోసాలను కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుందని... అందులో భాగంగానే ఈ నెల 22న 119 నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు తీయాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీలో రావణాసురుడి రూపంలో ఉన్న కేసీఆర్ పది వైఫల్యాలతో కూడిన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తామని చెప్పారు. ఆర్డీవో కార్యాలయాలు లేదా ఎమ్మార్వో కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించాలన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లలో కేసీఆర్ అటకెక్కించిన హామీలను ప్రజల్లోకి తీవ్రంగా తీసుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలను సూచించారు. కేజీ టూ పేజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ , నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12శాతం రిజర్వేషన్ హామీల విషయంలో తెలంగాణ సర్కార్ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు గుర్తుచేసేలా కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు.
బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్ పై చర్చ జరుగుతోందన్నారు. భట్టి పాదయాత్ర ఈ నెలాఖరులో ముగుస్తుందని చెప్పారు. ఖమ్మంలో జాతీయ నాయకులతో ఒక భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. మల్లు భట్టి విక్రమార్కతో సంప్రదించి ముగింపు సభ నిర్వహించాలనుకుంటున్నాం అని రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలలో ఉన్న అన్ని కులాలకు లక్ష రూపాయల రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy : టిఎస్పీఎస్సీ చేపట్టిన ఆ నియామకాలను రివ్యూ చేయాలి
బీ నర్సింగ రావు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి.. అలాంటి ఆయనకు ప్రభుత్వ పెద్దలు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు . తెలంగాణ కవులు, కళాకారులను అవమానించే హక్కు కేటీఆర్ కు లేదన్నారు. ఇప్పటికైనా వారిని గౌరవించి వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. పదేళ్లు పూర్తయినా 600 మంది అమరులను కూడా గుర్తించలేకపోయారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రెండో రాజధానిపై ప్రతిపాదన వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుందా? రాష్ట్రానికి వెళ్తుందా తెలియాలని డిమాండ్ చేశారు. విస్తృతంగా చర్చించిన తరువాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : TS Government New Scheme: గుడ్‌న్యూస్.. ఈ నెల 15న లక్ష సాయం.. ఇలా అప్లై చేసుకోండి
ఇది కూడా చదవండి : Minister KTR Speech: మరో ఐదేళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK