BC Scheme in Telangana: బీసీలకు ఆర్థిక సాయం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ప్రతి నెల 5వ తేదీలోపు లబ్ధిదారుల జాబితాను పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం ఈ నెల 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బీసీలకు లక్ష పథకంపై శనివారం హైదరాబాద్‌లోని డాబీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
పథకం తొలిదశ అమలును బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం మంత్రుల ఉప సంఘానికి వివరించారు. అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. అనంతరం మంత్రి గంగుల మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం తపిస్తారని అన్నారు. కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూతనిచ్చేందుకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని చెప్పారు. ఇప్పటివరకు 2,70,000 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయని చెప్పారు.
Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?
బీసీలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రి గంగుల. మొదటగా అర్హత కలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదవారికి అందజేస్తూ.. ప్రతీ నెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని చెప్పారు. ఇంఛార్జి మంత్రులు ధృవీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెల 15వ తేదీన స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు కేవలం http://tsobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలని సూచించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారంను ఏ ఆఫీసులోనూ.. ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుగోలు చేయాలన్నారు. లబ్ధిదారుల నిరంతర అభివృద్ధి కోసం అధికారులు పర్యవేక్షిస్తారని.. నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు.
Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి