Vegetable Price: దిగొచ్చిన టమాటా, పచ్చిమిర్చి ధరలు.. ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు..!
Vegetable Prices: గత రెండు నెలలుగా పెరుగుతూ వస్తున్న కూరగాయల తాజాగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా టమాటా, పచ్చి మిర్చి రేట్లు భారీగా తగ్గాయి. దీంతో కొనుగోళ్లు పెరిగాయి.
Vegetable Prices decrease: నెల రోజుల కిందట ఆకాశాన్నింటిన కూరగాయల ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు తగ్గుముఖం(Vegetable Prices decrease) పట్టాయి. చుక్కలు చూపించిన టమాటా.. ఘాటెక్కించిన మిర్చి ధరలు దిగొచ్చాయి. నార్త్ లో ఆకాల వర్షాలు, దిగుబడి తగ్గడం, రవాణా ఆటంకం తదితర కారణాల వల్ల కూరగాయల ధరల మోత మోగిపోయింది. దీంతో సామాన్యుడికి జేబుకి భారీగా చిల్లు పడింది. తాజాగా రేట్లు తగ్గడంతో దిగువ, మధ్య తరగతి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో గత నెలలో కిలో రూ.200 పలికిన టమాటా ధర.. నేడు రైతు బజార్లలో కేవలం రూ.15లకే లభిస్తోంది. గతంలో రూ.200 దాటిన పచ్చిమిర్చి.. ఇప్పుడు కిలో రూ.25లకే దొరుకుతుంది. మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా తగ్గాయి. రైతు బజార్లలో వంకాయ కిలో రూ.18, బీర రూ.18, దొండ రూ.18, కాలిఫ్లవర్ రూ.18, బీన్స్ రూ.35, కాకర రూ.23, బెండ రూ.23, ఉల్లి రూ.21, క్యాబేజీ రూ.13, కీర రూ.13 ఆలుగడ్డ రూ.21, చొప్పున లభిస్తున్నాయి. పంటలు చేతికిరావడంతో పాటు మార్కెట్లకు సరకు పోటెత్తడంతో కూరగాయలు ధరలు దిగొచ్చాయి. మరోవైపు ఏపీలోనూ ఇంచుమించు ఇదే విధంగా ధరలు ఉన్నాయి.
రాష్ట్రంలోని వరంగల్, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, మెదక్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కూరగాయల సాగు జరుగుతోంది. దీంతో మార్కెట్లన్నీ కూరగాయలతో కళకళ్లాడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మార్కెట్‌కు 110 క్వింటాళ్లు, మెహిదీపట్నం మార్కెట్‌కు రోజూ 80 క్వింటాళ్ల టమాటాలు వస్తున్నాయి. ఇతర కూరగాయలు కూడా 1100 టన్నులకు పైగా వస్తున్నాయి.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ రాఖీ పండుగ గిఫ్ట్.. వారి జీతాలు పెంచుతూ నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook