న్యూఢిల్లీ: 2018 రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఆషియన్ నేషన్స్ (ఏఎస్ఈఏఎన్)కు చెందిన 10 మంది లీడర్లు పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏఎస్ఈఏఎన్ నాయకులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.


ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ నెలలో ఫిలిప్పీన్స్ లోని మనీలాలో 15వ ఆసియన్- ఇండియన్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఇందులో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం తదితర అంశాలను చర్చించారు.  సమ్మిట్ లో ప్రధాని తీవ్రవాదం మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆ సందర్భంలోనే ప్రధాని ఆసియన్ లీడర్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇటీవలే విదేశాంగ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జైశంకర్ మాట్లాడుతూ ఆసియన్, తూర్పు ఆసియా దేశాలతో భారతదేశం సహకారం పెరిగిందన్నారు.