Bhiwandi building collapses Incident: భివండి: మహారాష్ట్ర (Maharashtra) లోని రాయ్‌ఘడ్ జిల్లా మహద్‌ తాలుకాలోని కాజల్‌పురాలో ఐదంతస్థుల భవనం కూలిన సంఘటన మరువక ముందే మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదే రాష్ట్రంలోని థానే జిల్లా భీవండి పట్టణం (Bhiwandi ) లో మూడంతస్థుల భవనం కుప్పకూలి ( building collapses )చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మూడంతస్థుల భవనంలో నివసిస్తున్న వారంతా గాఢ నిద్రలో ఉండగానే.. సోమవారం తెల్లవారుజూమున నాలుగు గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. శిథిలాల కింద మరో 25 మంది చిక్కుకోని ఉంటారని థానే మునిసిపల్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ ప్రమాదం సంభవించగానే.. స్థానికులు హుటాహుటిన 20మందిని కాపాడారు. వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. ఇంకా రెస్క్యూ కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. Also read: Narendra Modi: 7 రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం..!


సహాయక చర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఒక చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. అయితే భీవండీ పట్టణంలోని పటేల్ కాంపౌండ్ ప్రాంతంలో 1984లో ఈ భవనాన్ని నిర్మించినట్లు మునిసిపల్ అధికారులు వెల్లడించారు. భవనంలో దాదాపు 20కి పైగా ఫ్లాట్లు ఉండగా.. నివాసితులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం సంభవించింది. అయితే ఆ భవనంలో ఇంకా ఎంతమంది చిక్కుకున్నారనేది స్పష్టంగా తెలియరాలేదు. ఇదిలాఉంటే ఆగస్టు 24న మహారాష్ట్రలోని రాయ్‌ఘడ్‌లో భవనం కూలి దాదాపు 18 మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే.  Also read: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ