Omicron Cases in India: దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను భయాందళోనలకు గురిచేస్తోంది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 101 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు శుక్రవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒమిక్రాన్ కేసులు నమోదైన రాష్ట్రాలు వరుసగా.. మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 8.. గుజరాత్, కేరళలలో 5.. ఆంధ్రప్రదేశ్, చంఢీగఢ్, తమిళనాడు, పశ్చిమ బంగాల్ రాష్ట్రాల్లో ఒక్కొ ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు లవ్ అగర్వాల్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 91 దేశాలు ఒమిక్రాన్ బారిన పడినట్లు ఆయన స్పష్టం చేశారు. 


"డెల్టా సర్క్యులేషన్ తక్కువగా ఉన్న దక్షిణాఫ్రికాలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ జరిగే డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్ అధిగమించే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది" అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ లవ్ అగర్వాల్ తెలిపారు.


ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో వ్యాక్సినేషన్ డైవ్స్ ను వేగంగా నిర్వహిస్తున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక రేటుతో 4.8 రెట్లు ఎక్కువగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే దేశంలో ఉన్న కరోనా యాక్టివ్ కేసుల్లో కేరళలోనే 40.31 శాతానికి పైగా ఉన్నట్లు లవ్ అగర్వాల్ వెల్లడించారు.  


Also Read: Nagaland: నాగాలాండ్‌లో మెరుపు ధర్నా-వేలాదిగా వీధుల్లోకి పోటెత్తిన జనం...


Also Read:  Omicron: చాప కింద నీరులా ఒమిక్రాన్... ఢిల్లీలో కొత్తగా మరో 10 కేసులు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook