ఎమ్మెల్యే, ఎంపీలపై ఉన్న కేసులను `సుప్రీం` వెంటనే పరిష్కరించాలి: కేంద్రం
భారతదేశంలో వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఇప్పటి వరకు నమోదైన 3,816 కేసులను సుప్రీంకోర్టు వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
భారతదేశంలో వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఇప్పటి వరకు నమోదైన 3,816 కేసులను సుప్రీంకోర్టు వెంటనే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కేసులు ఇప్పటి వరకు 1,765 రాజకీయ నాయకులపై నమోదయ్యాయి.
వాటిని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు వీలైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా వెంటనే ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఇలాంటి కేసులను పరిష్కరించే స్పెషల్ కోర్టులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర, కేరళ, బిహార్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
వీటితో పాటు ఇంకా 12 రాష్ట్రాలు కోర్టులను ఏర్పాటు చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అలాగే అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల నుండి ఈ కోర్టుల ఏర్పాటు విషయమై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.
ఇటీవలే కేంద్ర న్యాయ,చట్టాల మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎమ్మెల్యే, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని హైకోర్టుల నుండి సేకరించమని సుప్రీంకోర్టుకు తెలిపింది.