Bihar road accident: బీహార్‌లోని వైశాలి జిల్లాలో (Vaishali district ) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులపై ట్రక్కు దూసుకురావడంతో నలుగురు చిన్నారులతో సహా 12 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం జిల్లాలోని దేస్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయా గావ్ తోలా గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హాజీపూర్-మహ్నార్ రహదారి పక్కన ఉన్న ఆలయంలో గ్రామస్తులు పూజలు చేస్తుండగా.. అదే సమయంలో అదుపుతప్పిన ట్రక్కు వారిపై దూసుకొచ్చింది. క్షతగాత్రులను హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన 12 మందిలో 9 మంది స్పాట్ లోనే చనిపోగా..మరో ముగ్గురు ఆస్పత్రి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారని స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ అన్నారు. 


మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. బీహార్‌లోని వైశాలిలో జరిగిన ప్రమాదం బాధాకరం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్వీట్ చేసింది. ఈ ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 



Also read: Aftab Poonawala CCTV Footage: శ్రద్ధా శరీర భాగాల బ్యాగుతో సీసీటీవీలో అఫ్తాబ్ కదలికలు 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook