Agriculture Bills: డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌పై అవిశ్వాసానికి నోటీసు
రాజ్యసభ (Rajya Sabha) లో ఆదివారం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ప్రవశపెట్టగా.. వాటిని విపక్ష పార్టీల సభ్యులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఆందోళన మధ్యనే రెండు కీలక వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది.
No Confidence Motion Against Rajya Sabha Deputy Chairman: న్యూఢిల్లీ: రాజ్యసభ (Rajya Sabha) లో ఆదివారం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టగా.. వాటిని విపక్ష పార్టీల సభ్యులందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ఆందోళన మధ్యనే రెండు కీలక వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం లభించింది. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh) విపక్ష సభ్యుల వివరణను పరిగణలోకి తీసుకోకుండా.. వ్యవసాయ బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపారని పార్టీలన్నీ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అయితే రాజ్యసభ ప్రారంభమైనప్పటి నుంచి మొదలైన ఈ దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మేరకు విపక్ష పార్టీలన్నీ (12 opposition parties) ఏకమై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం (no confidence motion ) ప్రవేశపెట్టాయి. సుమారు వంద మంది ఎంపీల సంతకాలతో 12 విపక్ష పార్టీలు హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇస్తూ పార్లమెంట్ కార్యాలయంలో అందజేశాయి. Also read: Agriculture bills: వ్యవసాయ బిల్లులకు రాజ్యసభలో ఆమోదం
ఉన్నత హోదాలో.. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను కాపాడాల్సిన హరివంశ్ వాటికి తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించుకున్నట్లు విపక్ష పార్టీలు పేర్కొన్నాయి. సరైన వివరణ, సమాధానాలు లేకుండానే ఎలా ఆమోదింపజేస్తారని ప్రశ్నించాయి. ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితమే ఈ వ్యవసాయ బిల్లులను పార్లమెంట్లో (parliament) ప్రవేశపెట్టగా.. లోక్‌సభలో ఆమోదం లభించింది. అనంతరం అదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. ఆ వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని, ముందు సెలక్ట్ కమిటీకి పంపించాలని ఆందోళన చేస్తూ విపక్షపార్టీల సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టారు. అనంతరం డిప్యూటీ చైర్మన్ తీరును నిరసిస్తూ.. నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటిసును ఇచ్చారు. Also read: Agriculture bills: పెద్దల సభలో గందరగోళం