12 Years old Boy dies due to cardiac arrest in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఎవరూ ఊహించని షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటికి ఇంటికి తిరిగివస్తుండగా స్కూల్ బస్సులో అకస్మాత్తుగా కుప్పకూలి.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన భింద్‌ జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు ఇక లేడని తెలిసి అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భింద్‌ ప్రాంతానికి చెందిన మనీశ్‌ జాటవ్‌.. స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మనీశ్ తన సోదరుడితో కలిసి పాఠశాల ఆవరణలో భోజనం చేశాడు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు స్కూల్ ముగిసిన వెంటనే ఇంటికి వెళ్లేందుకు స్కూల్‌ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కగానే వెంటనే మనీశ్‌ కుప్పకూలాడు. ఇది చూసిన బస్సు డ్రైవర్ స్కూల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. వారు హుటాహుటిన మనీష్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మనీష్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


'శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వచ్చేసరికి మనీశ్ జాటవ్‌ ప్రాణాలతో లేడు. సీపీఆర్‌ చేసినా అతడిని కాపాడలేకపోయాం. ప్రాథమిక లక్షణాలు చూస్తుంటే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం కోవిడ్-19 తర్వాత ఇటువంటి సంఘటనలు పెరిగాయి. మధ్యప్రదేశ్‌లో గుండెపోటుతో యువకుడు మరణించడం ఇదే మొదటిసారి' అని జిల్లా ఆసుపత్రి సర్జన్ డాక్టర్ అనిల్ గోయల్ మీడియాకు వెల్లడించారు.


మధుమేహం, మద్యపానం, ధూమపానం మరియు రక్తపోటు కారణంగా యువకులలో ఆకస్మిక గుండెపోటు సంఘటనలు గణనీయంగా పెరిగాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొంతమందిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఇటీవలి పరిశోధన ప్రకారం.. ఆకస్మిక గుండెపోటుతో చనిపోయిన వారిలో 13 శాతానికి పైగా కేసులు 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారే. ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఇతర దేశాలతో పోల్చితే భారతీయులకు తక్కువ వయస్సులోనే  గుండెపోటు వస్తుందట. కొందరిలో ఎలాంటి హెచ్చరిక లేకుండానే వస్తుందని పేర్కొంది. 


Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం


Also Read: Friday Remedies: శుక్రవారం ఈ చిన్న నివారణలు చేస్తే.. బీరువా నిండా డబ్బేడబ్బు! ప్రయత్నించి చూడండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.