Friday Remedies, For Huge Money Do these small remedy on Friday: శుక్రవారం లక్ష్మిదేవికి అంకితం చేయబడిన విషయం తెలిసిందే. ఈ రోజున పూజించడం వలన లక్ష్మిదేవి అనుగ్రహం పొందవచ్చు. అలాగే జాతకంలో శుక్ర గ్రహం కూడా బలపడుతుంది. లక్ష్మీదేవి మరియు శుక్ర దేవుని అనుగ్రహంతో.. వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు విరాజిల్లుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమ, ఆనందం ఉంటుంది. ఆర్థిక సంక్షోభం, వివాహ జీవితంలో సమస్య ఉంటే.. కొన్ని ప్రభావవంతమైన చర్యలు శుక్రవారాల్లో చేయాలి. లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు శుక్రుడిని బలపరిచే మార్గాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రవారం నాడు చేయాల్సిన పనులు ఇవే:
# లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు ఉదయాన్నే పూజ చేయాలి. లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి.. పాలతో చేసిన తీపి పదార్ధాలను (ఖీర్) పెట్టాలి.
# శుక్రవారం రాత్రి నిశిత కాల సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. పూజలో తామర పువ్వుల దండను సమర్పించాలి. మరుసటి రోజు ఆ దండను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ బీరువాలో ఉంచండి. అలా చేస్తే లక్ష్మీదేవి తన అనుగ్రహాన్ని అందిస్తుంది.
# లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం నాడు లక్ష్మీ స్తోత్రం, శ్రీ సూక్త లేదా కనకధార స్తోత్రాన్ని చదవాలి. ఇలా చేస్తే అపారమైన సంపద మరియు శ్రేయస్సు మీ సొంతం.
# శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తరువాత.. 2 లవంగాలు, 4 కర్పూరంతో ఆరతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
# శుక్రవారం నాడు కమలగట్ట దండతో 'ఓం శ్రీ హ్రీ శ్రీ కమ్లే కమలాలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీ హ్రీ శ్రీ ఓం మహాలక్ష్మీ నమః' అనే మా లక్ష్మి మంత్రాన్ని జపించండి. దాంతో లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి.
# జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉన్నవారు శుక్రవారం నాడు పూజ అనంతరం లక్ష్మీదేవికి ఖీర్‌ను నైవేద్యంగా సమర్పించి.. ప్రసాదం పంచి పెట్టాలి. అలానే డబ్బు, పండ్లు, ధాన్యాలు మొదలైన వాటిని అమ్మాయిలకు బహుమతిగా ఇవ్వండి. దీంతో మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి.
# జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న కారణంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. అలాంటి వారు శుభ సమయంలో శుక్రవారం వెండి ఆభరణాలను ధరించండి. ఒక వెండి గిన్నెలో తెల్లటి చందనం లేదా తెల్లని రాయిని ఉంచి మీ పడకగదిలో ఉంచండి.
# జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే క్రీమ్ కలర్ దుస్తులు ధరించాలి. ఇది చాలా లాభదాయకం.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.