India Coronavirus Positive Cases: దేశంలో 10వేలు దాటిన కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 31 మంది మృతిచెందారు. Corona Deaths in INDIA. కరోనా కేసులు 10వేలు దాటిపోయాయని అధికారులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి భారత్‌లో మరింతగా విజృంభిస్తోంది. కరోనా బలితీసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా కారణంగా 31 మంది మృతిచెందారు. తాజా మరణాలతో కలిపి కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 339కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1,211 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 10వేలు దాటిపోయింది. దేశంలో మొత్తం 10,363 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌లో 19,952 RPF పోస్టులు భర్తీ చేస్తున్నారా!
ప్రస్తుతం 8,988 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 1,035 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఒక్క మహరాష్ట్రలోనే సగానికి పైగా మరణాలు నమోదు కావడం గమనార్హం. సోమవారం తెలంగాణలో ఒక్కరిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. తెలంగాణలో ఇప్పటివరకూ 17 కరోనా మరణాలు సంభవించాయి. Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos
నేడు (ఏప్రిల్ 14న) 21 రోజులపాటు కొనసాగిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. కరోనా వైరస్ వ్యాప్తి అవుతున్న నేపథ్యంలో ఈ గడువును మరింత కాలం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ప్రకటన విడుదల చేయనున్నారు. తెలంగాణ, ఒడిషా రాష్ట్రాలు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ఇదివరకే ప్రకటించాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ