Coronavirus Latest: ఒక్క రోజులోనే 12 వేలకు పైగా కొత్త కేసులు.. ఎంత మంది చనిపోయారంటే?
Corona Cases in India: దేశంలో కరోనా కల్లోలం రేపుతోంది. తాజాగా 12,591 కొత్త కేసులు వెలుగు చూశాయి. వైరస్ తో మరో 29 మంది ప్రాణాలు విడిచారు.
India Covid-19 Updates: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 12,591 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ తో మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి కారణంగా ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర మరియు యూపీల్లో నలుగురు మృతి చెందారు. నిన్నటితో పోలిస్తే 20 శాతం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం కేసులలో ఇవి 0.14% శాతంగా ఉంది. కొవిడ్ నుంచి 10,827 మంది కోలుకున్నారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,286కి చేరుకుంది. భారతదేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 4.48 కోట్లకు పెరిగింది. గత 8 నెలల్లో ఒకే రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే.
దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,31,230కు పెరిగింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 5.46 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 5.32 శాతానికి చేరుకుంది. భారత్ కరోనా రికవరీ రేటు 98.67 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 4,42,61,476 మంది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్నారు. కరోనా మరణాల రేటు 1.18 శాతంగా ఉంది. భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 220,66,28,332 కరోనా టీకాలు అందించారు.
Also Read: Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై
Also Read: Vande Bharat Express: జింకను ఢీకొట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఆ డీర్ మీద పడి ఓ వ్యక్తి మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook