India Covid-19 Updates: దేశంలో 60 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

Covid-19 Updates: దేశంలో కరోనా చారలు చాస్తోంది. తాజాగా 9,111 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి కారణంగా 27 మంది ప్రాణాలు విడిచారు. రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 12:17 PM IST
India Covid-19 Updates: దేశంలో 60 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 9,111 కేసులు వెలుగు చూశాయి. తాజాగా వైరస్ తో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మెుత్తం మరణాల సంఖ్య 5,31,141కి పెరిగింది. తాజా కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు పెరిగాయి. మృతి చెందిన వారిలో గుజరాత్ నుండి ఆరుగురు, ఉత్తరప్రదేశ్ నుండి నలుగురు, ఢిల్లీ, రాజస్థాన్ మరియు కేరళ నుండి ముగ్గురు ఉన్నారు. 

గడిచిన ఒక్క రోజులో నమోదైన కేసులతో కోవిడ్ కేసుల సంఖ్య 4.47 కోట్లుకు చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 8.40 శాతంగా నమోదైంది. వారం వారీ సానుకూలత రేటు 4.94 శాతంగా ఉంది. మెుత్తం కరోనా కేసుల్లో  యాక్టివ్ కేసుల సంఖ్య 0.13 శాతంగా ఉన్నాయి. కొవిడ్ రికవరీ రేటు 98.68 శాతంగా నమోదైంది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,42,35,772కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ టీకా డోసులు అందించారు. 

Also read: West Bengal: హీట్ వేవ్ ఎఫెక్ట్.. విద్యా సంస్థలకు వారం రోజులు సెలవు ప్రకటించిన మమతా బెనర్జీ!

కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రప్రభుత్వాలు కలిసి రీసెంట్ గా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. ఆస్పత్రుల్లో మాస్కులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ బెడ్లు మరియు కరోనా పరీక్షలు తదితర వివరాలను ఈ డ్రిల్ లో సేకరించారు.  కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ మాస్కులు ధరించి బయటకు వెళ్లాలని.. అంతేకాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

Also Read: Navi Mumbai: మహారాష్ట్రలో విషాదం.. వడదెబ్బకు 11 మంది మృత్యువాత.. వందలాది మందికి అస్వస్థత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News