'కరోనా వైరస్' భారత దేశంలో క్రమక్రమంగా విస్తరిస్తోంది. నిన్నటి వరకు 13 వందల 97గా ఉన్న  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు దాదాపు 15 వందలకు చేరువకు వెళ్లింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే 146 కొత్త కేసులు నమోదు కావడం కలకలం  రేపుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినా .. కేసుల పెరుగుదల సంఖ్య మాత్రం ఆగడం లేదు.  దీంతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల  సంఖ్య 14 వందల 66కు చేరింది. ఇందులో 38 మంది మృతి  చెందారు. ఇప్పటి వరకు మొత్తం 133 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారు. మరోవైపు గత 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. గుజరాత్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్  లలో ఒక్కొక్కరు మృతి చెందారు. 


'కరోనా వైరస్' గురించి మరో భయంకరమైన నిజం..!!


అటు  ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 57 వేల 487కు చేరింది.  కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 42 వేల 107 మంది మృతి చెందారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 88 వేల 172కు  చేరుకుంది..జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..