న్యూ ఢిల్లీ: పంజాబ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ శతవిథాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా రెండు రోజుల పర్యటన నిమిత్తం పంజాబ్‌లో పర్యటిస్తున్న అరవింద్ కేజ్రీవాల్.. మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా వారికి బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఎన్నికల హామీలు గుప్పించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే.. 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ. 1000 అందివ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పంజాబ్‌లో మహిళల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసమే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మొగలో జరిగిన పర్యటనలో అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేశారు.



Also read : ఛత్తీస్‌ఘడ్‌లో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. సీఎం భూపేశ్ బఘేల్ కీలక నిర్ణయం


పంజాబ్‌లో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెడితే.. 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతికి, మహిళకు రూ. 1000 అందిస్తామని ప్రకటించిన కేజ్రీవాల్.. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు మహిళలు ఉంటే.. వారికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున అందించనున్నట్టు స్పష్టంచేశారు. ప్రపంచంలోనే ఇదొక అతి పెద్ద మహిళా సాధికారిక కార్యక్రమం అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.


Also read : వెళ్తున్న ట్రక్కులోంచి కిందపడిన కరెన్సీ నోట్లు.. ఏరుకున్నోళ్లకు ఏరుకున్నంత.. వైరల్ వీడియో


Also read : వైరల్ పిక్: పడగవిప్పిన మూడు పాములు.. ఆశీర్వాదం అనుకో అంటున్న ఐఎఫ్ఎస్ ఆఫీసర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook