2013 Patna serial blasts Case: పట్నా పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష..ఇద్దరికీ జీవిత ఖైదు
2013 పట్నా బాంబు పేలుళ్ల కేసులో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ..ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మొత్తం 9మందిలో నలుగురు దోషులకు మరణశిక్ష, ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి పదేళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
2013 Patna serial blasts Case: బిహార్ రాజధాని పట్నాలో 2013లో మోదీ(Narendra Modi) ర్యాలీ సందర్భంగా జరిగిన పేలుళ్ల ఘటనలో నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ.. ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు(NIA court) సంచలన తీర్పు వెల్లడించింది. పేలుళ్ల కేసులో మొత్తం 9 మందిని దోషులుగా తేల్చిన ఎన్‌ఐఏ కోర్టు.. నలుగురికి ఉరిశిక్షతో పాటు, ఇద్దరికి జీవిత ఖైదు (life imprisonment), మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో దోషికి ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
వివరాల్లోకి వెళితే...
2013 అక్టోబరు 27న ఎన్‌డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ప్రకటించిన సందర్భంగా పట్నాలోని గాంధీ మైదానంలో ‘హుంకార్’ పేరుతో భారీ ర్యాలీ(political rally) చేపట్టారు. ఆ సమయంలో మోదీ గుజరాత్ సీఎం(Gujarat CM Modi)గా ఉన్నారు. మోదీ ప్రసంగం చేయాల్సిన వేదికకు 150 మీటర్ల దూరంలో వరుసగా ఆరు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మోదీ, ఇతర భాజపా నాయకులు సభా వేదికకు రాకముందే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మందికి పైగా గాయపడ్డారు.
Also read: Arunachal Pradesh: నల్లగా మారిన నది...వేలాది సంఖ్యలో చేపలు మృతి!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును 2013 నవంబర్ 6న ఎన్‌ఐఏ(NIA)కు అప్పగించారు. దీనిపై సుదీర్ఘంగా దర్యాప్తు జరిపిన ఎన్‌ఐఏ మొత్తం 11 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనిపై ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గతవారం విచారణ జరిపింది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో అతడి కేసును జువైనల్ జస్టిస్ బోర్డుకు బదిలీ చేసింది. మరో వ్యక్తిని సరైన ఆధారాలు లేని కారణంగా నిర్దోషిగా ప్రకటించింది. మిగతా 9మందిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం.. సోమవారం వారికి శిక్షలు ఖరారు చేసింది.
దోషులను హైదర్ అలీ, నోమన్ అన్సారీ, మహమ్మద్ ముజిబుల్లా అన్సారీ, ఇమ్తియాజ్ ఆలమ్, అహ్మెద్ హుస్సైన్, ఫక్రుద్దిన్ మహమ్మద్, ఫిరోజ్ అస్లామ్, ఇమ్తియాజ్ అన్సారీ, మహమ్మద్ ఇఫ్తికర్ ఆలమ్, అజారుద్దిన్ ఖురేషి, తౌఫిక్ అన్సారీగా గుర్తించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook