India Covid update: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు 19 శాతం మేర తగ్గి, 25 వేలకు చేరాయి. సుమారు ఐదు నెలల కనిష్ఠానికి క్షీణించాయి. క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా గణాంకాలను విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల వ్యవధిలో  25,072 మంది మహమ్మారి(Covid) బారిన పడగా..389 మంది మరణించారు. మొత్తం కేసులు 3.24కోట్లకు చేరాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756గా ఉంది. నిన్న 44,157 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.16 కోట్ల(97.63 శాతం)కు చేరాయి. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 3,33,924(1.03 శాతం) మంది కొవిడ్‌(Corona)తో బాధపడుతున్నారు. 


ప్రస్తుతం భారత్‌లో 3,33,924 యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 12,95,160 టెస్టులు చేశారు. భారత్‌(India)లో ఇప్పటివరకు 50 కోట్ల 75 లక్షల 51 వేల 399 టెస్టులు చేశారు. మరోపక్క ఆదివారం కేవలం 7,95,543 మంది టీకా(Covid Vaccine) వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 58.25 కోట్లకు చేరింది.


Also Read: India Corona Update: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా వైరస్ సంక్రమణ


తగ్గిన కేసులు
కొత్త కేసులు పది రోజులుగా 40 వేల కంటే తక్కువే వస్తున్నాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళ(Kerala)లో 10.4వేల కొత్త కేసులు రాగా... తర్వాత మహారాష్ట్రలో 4.1వేలు, ఛండీగఢ్‌లో 3వేలు వచ్చాయి. ఆదివారం దేశంలోనే ఎక్కువగా కేరళలో 145 మంది చనిపోగా... ఆ తర్వాత ఒడిశాలో 69, కేరళలో 66 మంది చనిపోయారు. ప్రస్తుతం హర్యానా(Harayana), జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)లో మాత్రమే యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. గత వారానికీ, అంతకు ముందు వారానికీ మధ్య కొత్త కేసులు 12 శాతం తగ్గాయి. ప్రపంచ దేశాల్లో 4 శాతం తగ్గాయి. టెస్టుల పాజిటివిటీ రేటు(positive Rate) ఇండియాలో 1.94 శాతం ఉంది. కేరళలో ఇది 15.98 శాతం ఉండగా... సిక్కింలో 11.11 శాతం, మణిపూర్‌లో 11.01 శాతం ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook