Himachal pradesh fire Accident:  హిమాచల్ ప్రదేశ్​ కుల్లూ జిల్లా(Kullu District)లో ఘోర అగ్ని ప్రమాదం(Massive Fire Accident) సంభవించింది. మజాణ్​ గ్రామం(Mazhan Village)లో జరిగిన ఈ ప్రమాదంలో 27 ఇళ్లతో పాటు రెండు దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. 26 గోశాలలు దగ్దమయ్యాయి. దాదాపు 9 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. షార్ట్​ సర్క్యూట్​ కారణంగానే ప్రమాదం జరిగినట్లు వారు భావిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: పాఠశాల సెలవుల కోసం మంచినీటిలో పురుగు మందు కలిపిన విద్యార్థి.. 19 మందికి అస్వస్థత


ఈ ఘటనపై సీఎం జైరామ్​ ఠాకూర్(CM Jairam Thakur)దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇళ్లల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో..జనం భయంతో పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో రాయ్ నాగ్ దేవత అనే పురాతన ఆలయం దగ్ధమైంది. శరీరంపై వేసుకున్న గుడ్డలు తప్ప ఏమీ మిగల్లేదని మజాన్ గ్రామస్థులు వాపోయారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook