గ్రేటర్ నోయిడా పరిధిలోని షాబెరీ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆరంతస్థుల భవనం కూలింది. భవనం కూలి పక్కనే ఉన్న నాలుగు అంతస్థుల భవనంపై పడటంతో అది కూడా కుప్పకూలింది. నాలుగు అంతస్థుల భవనంలో మొత్తం 18 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీయగా.. భవన శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానం. వందల మంది పోలీసులు, స్థానికులు శిథిలాల తొలగింపులో సహాయం చేస్తున్నారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


సమాచారం అందుకున్న జాతీయ విపత్తు నివారణ దళం వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలకు పూనుకుంది. '6 అంతస్తుల భవనం గత రాత్రి కూలిపోయింది. ఇప్పటి వరకు 2 మృతదేహాలను వెలికి తీశాము. 4 టీంలు ఇక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి' అని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఆర్ఎస్ కుష్వాహ ఎఎన్ఐతో మాట్లాడారు.



 


ఈ ఘటనలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ముందస్తుగా 12 అంబులెన్సులు సిద్ధం చేసినట్లు మంత్రి మహేష్ శర్మ తెలిపారు. భవనాల ప్రమాద వివరాలపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.