Wall collapse Tamil Nadu: తమిళనాడు(Tamil Nadu)లో విషాదం చోటుచేసుకుంది. పాఠశాల గోడ కూలి(Toilet Wall Collapse)..ముగ్గురు చిన్నారుల మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి...చికిత్స అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరునెల్వేలి(TiruneIveli)లోని షాఫ్టర్ హయ్యర్ సెకండరీ స్కూల్(Schaffter Higher Secondary School) చాలా పురాతనమైనది. ఇది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ సహాయక పాఠశాల. ఈ స్కూల్ టాయిలెట్ గోడ ఈరోజు ఉదయం కూలిపోయింది. అక్కడే ఉన్న ముగ్గురు 8వ తరగతి విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ముగ్గురు విద్యార్థులను ఆస్రత్రికి తరలించారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు.


Also Read: Gujarat Chemical Factory Explosion: గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు


ఇది 130 సంవత్సరాల పురాతన పాఠశాలని పోలీసులు తెలిపారు. విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సంతాపం తెలిపారు . బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook