Gujarat Chemical Factory Explosion: గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు

Gujarat Chemical Factory Explosion: గుజరాత్ పంచ్‌మహల్  మహా విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 16, 2021, 02:47 PM IST
Gujarat Chemical Factory Explosion: గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు, ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు

Gujarat Chemical Factory Explosion: గుజరాత్ పంచ్‌మహల్  మహా విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా..15 మందికి కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గుజరాత్ రాష్ట్రంలోని పంచ్‌మహల్ జిల్లాలోని ఫ్లోరా కెమికల్ ఫ్యాక్టరీలో భారీ విస్ఫోటనం(Gujarat Chemical Factory Explosion) సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 15 మంది సిబ్బందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలో దిగి..మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫ్లోరా కెమికల్ ఫ్యాక్టరీలో(Flora Chemical Factory) ప్రమాదం ఉదయం 10 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. కొన్ని కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్దం విన్పించిందని స్థానికులు చెబుతున్నారు. విస్ఫోటనం కారణంగా ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలో దిగిన పోలీసులు..అగ్నిమాపక బృందాల్ని రప్పించారు. రంజీత్ నగర్ సమీపంలోని గుజరాత్ ఫ్లోరా కెమికల్స్ లిమిటెడ్‌లోని రసాయనిక విభాగంలో పేలుడు సంభవించినట్టు పోలీసు అధికారి లీనా పాటిల్ తెలిపారు. విస్ఫోటనం చాలా భయంకరంగా ఉండటంతో ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యారు.

క్షతగాత్రుల్ని వివిధ ఆసుపత్రులకు తరలించామని లీనా పాటిల్ తెలిపారు. ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మరణించారని..మరో 15 మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. వీరిలో కొంతమందికి తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీలో క్షేమంగా ఉన్నవాళ్లు, గాయపడినవారిని గుర్తించి..రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంటలు అదుపులో వచ్చాయని సమాచారం.

Also read: Omicron cases: ఢిల్లీలో మరో నాలుగురికి ఒమిక్రాన్​- 10కి చేరిన మొత్తం కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News