UP Hathras gang rape case: ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హత్రాస్ (Hathras) జిల్లాలో యువతిపై జరిగిన దారుణ సంఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికుతోంది. సెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక (Gang Rape) అత్యాచారానికి పాల్ప‌డి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు. రెండువారాల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు మంగళవారం కన్నుమూసింది. అయితే హత్రాస్ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) స్పందించారు. బాధితురాలి మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని, కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి స్ప‌ష్టంచేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తునకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశామ‌ని సీఎం యోగి చెప్పారు. ముగ్గురు సభ్యుల ప్యానల్ బృందం ద‌ర్యాప్తు జ‌రిపి వారం రోజుల్లో నివేదిక స‌మ‌ర్పిస్తుందని ఆయన వెల్లడించారు. Also read: Hathras Gang Rape: మృగాళ్ల వేటకు యువతి బలి.. బలవంతంగా మృతదేహం దహనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కేసులో బాధిత కుటుంబానికి స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని హామి ఇచ్చారు. అయితే.. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ఫోనులో మాట్లాడారని ముఖ్యమంత్రి యోగి తెలిపారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌ధానమంత్రి మోదీ త‌న‌ను ఆదేశించార‌ని యోగి చెప్పారు. అయితే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. Also read: Babri Masjid demolition case: నేడే బాబ్రీ తీర్పు


ఇదిలాఉంటే.. (UP Hathras) కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించకుండా బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు బలవంతంగా చేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే గ్రామంలో అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఆరోపణలను హత్రాస్ ఎస్‌డీఎం ఖండించారు. కుటుంబసభ్యులకు సమాచారమిచ్చే దహన సంస్కారాలు చేశామని పేర్కొన్నారు.