అతనొక అధికార పార్టీ  దళిత ఎమ్మెల్యే. ఆమె ఓ అర్చకుని కుమార్తె. ఇద్దరి వయస్సులో తేడా దాదాపుగా సగం. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడీ వివాహం వివాదాస్పదమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తమిళనాడు ( Tamilnadu ) లోని అధికారపార్టీ ఏఐఏడీఎంకే ( AIADMK ) కు చెందిన 36 ఏళ్ల ప్రభు కళ్లాకురుచి ఎస్సీ రిజర్వ్  స్థానం నుంచి ఎమ్మెల్యే. మలైకొట్టై ఆలయంలో అర్చకుడిగా ఉన్న స్వామినాథన్ కుమార్తె సౌందర్య డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈమె వయస్సు 19 ఏళ్లు. సౌందర్య తన ఇంట్లోంచి బయటకు వచ్చేయగా..ఎమ్మెల్యే కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ పెళ్లికు సౌందర్య తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. సౌందర్య తండ్రి స్వామినాథన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. ప్రభు తల్లిదండ్రులు కూడా అదికార పార్టీకు చెందినవారు కావడం విశేషం.


ఎమ్మెల్యే ప్రభు ( MLA Prabhu ) తన కుమార్తె మైనర్ గా ఉన్నప్పుడు అంటే నాలుగేళ్ల క్రితమే వలలో వేసుకున్నాడని..సౌందర్య తండ్రి స్వామినాథన్ ఆరోపించారు. బలవంతంగా తమ కుమార్తెను  పెళ్లి చేసుకున్నారనేది స్వామినాథన్ ఆరోపణ. తనను తాను చంపుకుంటానని బెదిరించారు. అయితే ఎమ్మెల్యే ప్రభు మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేశారు. కిడ్నాప్ చేసి బలవంతంగా వివాహం చేసుకున్నాననడాన్ని ఖండించారు. గత కొద్దినెలలుగా తామిద్దరం ప్రేమించుకున్నామన్నారు. మర్యాదప్రకారం ఆమె తల్లిదండ్రుల్ని కలిసి అడిగానని..అయితే వారు అభ్యంతరం తెలిపారన్నారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నానన్నారు. 


అటు ఆత్మహత్యకు ప్రయత్నించిన స్వామినాథన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ అంశం తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. Also read: PM Narendra Modi: నియమాలు పాటిద్దాం.. కరోనాను జయిద్దాం