చత్తీస్‌ఘడ్‌లో గురువారం సరిహద్దు భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. కంకర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాల్సిందిగా మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో పారామిలిటరి బలగాలు భద్రతను మరింత కట్టుదిట్టం చేసి మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177807","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


చత్తీస్‌ఘడ్‌లో 11 లోక్ సభ నియోజకవర్గాలకుగాను ఏప్రిల్ 11, 18, 23 తేదీల్లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.