Jharkhand news today: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం పిడుగుపాటుకు నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరొక చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ ఘటన రాధానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబుటోలా వద్ద జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే..
సాహిబ్‌గంజ్ జిల్లాలోని రాధానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొందరు చిన్నారులు మామిడి కాయలు కోయడానికి తోటకు వెళ్లారు. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో.. వీరంతా అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కిందకు చేరారు. సడన్ గా పిడుగు పడటంతో వారిలో నలుగురు మృత్యువాతపడగా.. మరొకరు గాయపడ్డారు. గాయపడిన చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వయస్సు 9-11 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతుల్లో హుమాయున్ సేఖ్ యెుక్క ​​12 ఏళ్ల కుమార్తె, తొమ్మిదేళ్ల కుమారుడు..మెహబూబ్ సేఖ్ యెుక్క​​పదేళ్ల కుమారుడు, అష్రాఫుల్ సేఖ్ ​​యెుక్క తొమ్మిదేళ్ల కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.


Also Read: Maoists Attack: ఛత్తీస్‌గఢ్ లో దారుణం.. పోలీసుల వాహనం లక్ష్యంగా మావోయిస్టుల పేలుడు, 10 మంది మృతి


చిన్నారుల మృతి పట్ల ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ శోకాన్ని భరించే శక్తి మృతుల కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఆ రాష్ట్రంలో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 


Also Read: PM Modi Speech in Karnataka: నా సమాధికి గొయ్యి తీస్తామని బెదిరిస్తున్నారు.. ఓటుతో బుద్ధి చెప్పండి: ప్రధాని మోదీ పవర్‌ఫుల్ స్పీచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook