New coronavirus strain: భారత్‌లో పెరుగుతున్న కొత్త వైరస్ కేసులు
New coronavirus strain: బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ భారత్‌లో కలకలం రేపుతోంది. కరోనా కొత్త వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య..
New coronavirus strain: బ్రిటన్ కరోనా స్ట్రెయిన్ భారత్‌లో కలకలం రేపుతోంది. కరోనా కొత్త వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య..
యూకే ( UK ) నుంచి ఇండియాకు విస్తరించిన కరోనా కొత్త వైరస్ ( New coronavirus ) కేసులు కలవరం కల్గిస్తున్నాయి. ఊహించినట్టే సంక్రమణ వేగంగా ఉంది. తుది పరీక్షల అనంతరం ఇండియాలో కొత్త కరోనా వైరస్ కేసుల సంఖ్య 25కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ( Central health ministry ) ప్రకటించింది. తాజాగా 4 కేసులు వెలుగుచూడటంతో ఆందోళన తీవ్రమవుతోంది.
యూకే నుంచి ఇండియాకు రిటర్న్ అయినవారిలో మూరో మూడు కేసులు పూణే వైరాలజీ ల్యాబ్‌లో ధృవీకరించగా..ఢిల్లీ ( Delhi ) ఐజీఐబీలో మరో కేసును గుర్తించారు. మొత్తం 25 మందిని వైద్య పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉంచారు. యూకే నుంచి ఎవరెవరు ఇండియాకు వచ్చారనే వివరాలు సేకరిస్తూ..పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసి..అనంతరం కొత్త స్ట్రెయిన్ ( New strain ) ఉందో లేదో తెలుసుకునే క్రమంలో పూణే ( Pune ), సీసీఎంబీ ( CCMB ), నిమ్‌హ్యాన్స్ ( NImhans ) వంటి ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు.
కొత్త వైరస్ మరింతగా విస్తరించకుండా ఉండేందుకు కేంద్రం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వైరస్ సోకిన వారి కాంటాక్ట్ ట్రేస్ చేయడం,వారితో సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించడం చేస్తూ..పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Also read: Income tax returns: ఐటీఆర్ గడువు మరోసారి పొడిగింపు