Uttar Pradesh: యూపీలో ఘోర దుర్ఘటన సంభవించింది. మట్టిని తెచ్చేందుకు కాలువ దగ్గరకు వెళ్లి ఐదుగురు బాలికలు నీటిలో మునిగి (Five Girls Drown) మృతి చెందిన ఘటన సుల్తాన్‌పూర్ జిల్లా మోతీగార్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఐదుగురు బాలికల మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా మేజిస్ట్రేట్ మరియు సీనియర్ పోలీసు అధికారులను ఆదేశించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం మట్టిని తేవడానికి ఐదుగురు బాలికలు కలిగంజ్ బజార్‌లోని కాలువ దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో కాలువలో పడి ఆ ఐదుగురు బాలికలు మృతి చెందారు. కేకలు విని సంఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్థులు పెమాపూర్ ఖజూరిలో నివాసముంటున్న ఆషియా (13), అస్మీన్ (13), నందిని (13), అంజాన్ (13) అనే నలుగురిని బయటకు తీయగలిగారు. నలుగురు బాలికల మరణాన్ని సుల్తాన్‌పూర్ డీఎం రవీష్ గుప్తా గతంలో ధృవీకరించారు. ఐదవ బాలిక అయిన తొమ్మిదేళ్ల ఖుషీ మృతదేహాన్ని సాయంత్రానికి కనుగొన్నారు. ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.



Also Read: Uttarakhand landslides: ఉత్తరాఖండ్‌ లో విరిగిపడిన కొండచరియలు... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook