Uttarakhand landslides: ఉత్తరాఖండ్‌ లో విరిగిపడిన కొండచరియలు... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..

Uttarakhand landslides: ఉత్తరాఖండ్‌ లో కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 22, 2022, 01:18 PM IST
Uttarakhand landslides: ఉత్తరాఖండ్‌ లో విరిగిపడిన కొండచరియలు... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..

Uttarakhand landslides: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలకు కొండచరియలు విరిపిపడుతున్నాయ. శనివారం ఉదయం చమోలీ జిల్లాలోని (Chamoli District) తరాలి ప్రాంతంలో మూడు ఇళ్లపై కొండచరియలు (Uttarakhand landslides) విరిగిపడడంతో నలుగురు మృత్యువాత పడగా.. ఒకరు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం విశేషం. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల నుంచి 12ఏళ్ల బాలికను సురక్షితంగా బయటకు తీశారు అధికారులు. 

సమాచారం అందుకున్న పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని తరాలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) రవీంద్ర జువంత తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. ఒకే ఫ్యామిలిలోని నలుగురు మరణించడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 

ఉత్తరాఖండ్‌లో తరుచుగా కుండపోత వర్షాలు (Heavy Rains in Uttarakhand) కురుస్తున్నాయి. దీంతో గత నెలలో ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడటంతో..తవాఘాట్ లిపులేఖ్ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో కైలాష్ మానససరోవర్ యాత్రకు బయలుదేరిన 40 నజాంగ్ తాంబా గ్రామ సమీపంలో చిక్కుకుపోయారు. ఈ ఏడాది జూన్ లో డెహ్రాడూన్ లో వాహనంపై వాహనం కొండచరియలు విరిగిపడటంతో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. 

Also Read: MP Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది దుర్మరణం..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News