Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ అగ్ని ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఔరంగాబాద్ సమీపంలోని వలుజ్ ఛత్రపతి శంభాజీనగర్ లో జరిగింది. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్దంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే...
సన్ షైన్ ఎంటర్ ప్రైజెస్ హ్యాండ్ గ్లవ్స్ ఫ్యాక్టరీలో సుమారు 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. నైట్ షిప్ట్ లో పది నుంచి పదిహేను మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను గమనించిన కొందరు తప్పించుకోగా.. ఆరుగురు బయటకు రాలేక అగ్నికి అహూతి అయ్యారు.


Also Read: New Year 2024: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ ఇక్కడ ప్లాన్ చేసుకోండి.. టాప్-10 లోకేషన్స్ ఇవే..!


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు వివరాలు కానీ, అగ్ని ప్రమాదానికి గల కారణాలు గానీ తెలియరాలేదు. అయితే భారీ ఆస్తి నష్టం వాటిల్లిన్నట్లు తెలుస్తోంది. 


Also Read: Income tax Exemption: ఉద్యోగులకు శుభవార్త, ట్యాక్స్ మినహాయింపు 10 లక్షలు పెంచే అవకాశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook