6th Phase Elections Notification:  దేశ వ్యాప్తంగా 6వ దశ ఎన్నికల్లో భాగంగా  57 లోక్ సభ స్థానాలకు ఈ రోజు (30-4-2024) ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల మే 6 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మే 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 6వ దశలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలతో పాటు హర్యానాలోని 10 స్థానాలు., బిహార్‌లోని 8 స్థానాలకు, ఒడిషాలోని 6 లోక్ సభ సీట్లకు, ఉత్తర ప్రదేశ్‌లోని 14 స్థానాలు.. పశ్చిమ బెంగాల్‌లోని 8 లోక్ సభ సీట్లు.. జార్ఝండ్‌లోని 4 స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6వ దశలో కీలకమైన కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీతో పాటు బీజేపీకి పట్టున్న ఉత్తర ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కన్నయ్య కుమార్.. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్నికల బరిలో నిలవనున్నారు. జూన్ 4న దేశంలోని 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు కౌంటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతోపాటు ఏపీలోని అసెంబ్లీకి కలిపి ఈ మే 13న తేదిన నాల్గో విడతలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి.


Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook