రాయఘడ్: విశాఖపట్నం జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌లో ఇటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. రాయఘడ్‌లో ఓ పేపర్ మిల్లులో ట్యాంక్ క్లీన్ చేస్తుండగా అందులోంచి విష వాయువులు ( Raigarh gas leakage) వెలువడిన ఘటనలో ఏడుగురు సిబ్బంది ఆస్పత్రిపాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని రాయగఢ్ ఎస్పీ సంతోష్ సింగ్, జిల్లా కలెక్టర్ యశ్వంత్ కుమార్ తెలిపారు. పేపర్ మిల్లులో గ్యాస్ లీకైన ఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం జిల్లా ఎస్పీ, కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Vizag tragedy : మృతుల కుటుంబాలకు రూ కోటి ఎక్స్‌గ్రేషియా


ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా దాచిపెట్టి ఈ ఘటనను బయటికి పొక్కకుండా ఉంచేందుకు పేపర్ మిల్లు యాజమాన్యం ప్రయత్నించిందని జిల్లా ఎస్పీ సంతోష్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్టు ఎస్పీ వెల్లడించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..