Vizag tragedy : మృతుల కుటుంబాలకు రూ కోటి ఎక్స్‌గ్రేషియా

విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో ( Vizag tragedy) మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రకటించారు.

Last Updated : May 7, 2020, 03:17 PM IST
Vizag tragedy : మృతుల కుటుంబాలకు రూ కోటి ఎక్స్‌గ్రేషియా

వైజాగ్ : విశాఖపట్నం జిల్లా ఆర్.ఆర్. వెంకటాపురంలోని ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో ( Vizag tragedy) మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్టు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( AP CM YS Jaganmohan Reddy ) ప్రకటించారు. తీవ్ర అస్వస్థతకుగురై వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారికి రూ. 10 లక్షలు, విష వాయువు ప్రభావంతో ఆస్పత్రిపాలైన సాధారణ కేసుల బాధితులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఆయన తెలిపారు. 

Also read : Vizag: గ్యాస్ లీకేజీపై స్పందించిన కంపెనీ

ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ విషాద ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను, మృతుల కుటుంబాలను సీఎం వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని వారికి ధైర్యం చెబుతూ సీఎం జగన్ ఈ ప్రకటన చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News