Bihar News: బీహార్ లో కరోనా కలకలం రేపుతోంది. అక్కడ కరోనా (COVID-19) బారినపడుతున్న వైద్యుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాట్నాలోని నలంద వైద్య కళాశాల, ఆసుపత్రి(ఎన్​ఎంసీహెచ్​)లో (Nalanda Medical College and Hospital) తాజాగా మరో 72 మంది వైద్యులకు వైరస్​ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది ఈ విషయాన్ని మెడికల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ వినోద్​ కుమార్​ సింగ్​ తెలిపారు. జనవరి 1, 2 తేదీల మధ్య 87 మంది వైద్యులకు కొవిడ్ సోకగా...తాజా కేసులతో కలిపి ఆస్పత్రిలో మెుత్తం కేసుల సంఖ్య 159కి చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇటీవల పాట్నాలో జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే (Indian Medical Association function) ఈ వ్యాప్తికి కారణమైనట్లు భావిస్తున్నారు. ఈ సదస్సుకు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) సమయంలో.. వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వైద్యులు బీహార్​లోనే అధికంగా ఉన్నారని ఐఎంఏ గతంలో వెల్లడించింది. అదే విధంగా పంజాబ్ (Punjab) లోని పాటియాలా ప్రభుత్వ వైద్య కాలేజీలో 102 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. 


Also Read: Bihar: మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం.. 87 మంది వైద్యులకు పాజిటివ్!


దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 37,379 కేసులు (Corona Cases in Inida) వెలుగుచూశాయి. వైరస్ తో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 1,71,830 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ కొవిడ్​ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook