Bihar: మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం.. 87 మంది వైద్యులకు పాజిటివ్!

Bihar: పాట్నాలోని నలంద మెడికల్ కళాశాల, ఆస్పత్రిలో  87 మంది వైద్యులకు కరోనా నిర్ధరణ కావడం కలకలం సృష్టించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 12:46 PM IST
Bihar: మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం.. 87 మంది వైద్యులకు పాజిటివ్!

Doctors test covid positive: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కొవిడ్ కేసులు రోజురోజూకు పెరుగుతున్నాయి. తాజాగా బీహార్ పాట్నాలోని (Patna) నలంద వైద్య కళాశాల, ఆస్పత్రిలో(ఎన్ఎంసీహెచ్​) 87 మంది వైద్యులు కరోనా (Covid-19) బారినపడడం కలకలం రేపింది. వారంతా ఆస్పత్రిలో క్యాంపస్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఇటీవల జరిగిన భారతీయ వైద్యుల సంఘం(ఐఎంఏ) 96వ జాతీయ వార్షిక సదస్సే (Indian Medical Association function) ఈ వ్యాప్తికి కారణమైనట్లు భావిస్తున్నారు. 

"ఎన్ఎంసీహెచ్​లో 87 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవు. మరికొంతమందికి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. వారంతా ఆస్పత్రి క్యాంపస్​లో ఐసొలేషన్​లో ఉన్నారు" అని పట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. ఎన్ఎంసీహెచ్​లో (Nalanda Medical College and Hospital) మొత్తం 194 నమూనాలకు ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలు నిర్వహించగా.. అందులో శనివారం 12 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 75 మందికి ఆదివారం వైరస్​ నిర్ధరణ అయింది. ఈ నేపథ్యంలో పాట్నా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్​ బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే చర్యలు వేగవంతం చేసింది.

Also Read: Corona cases in India: ఒక్క రోజులో 33 వేల కరోనా కేసులు- థార్డ్​ వేవ్​కు సంకేతమా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News