DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చ్ నెల నుంచి డీఏ పెరగనుంది. జనవరి, ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చ్ జీతంతో భారీగా చేతికి అందవచ్చని అంచనా. అదే సమయంలో కనీస వేతనం పెరగడం, 8వ వేతన సంఘం ప్రారంభం కావడం జరగవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో రెండుసార్లు డీఏ పెరుగుతుంటుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా ఈ జీతం పెంపు ఉంటుంది. ఈ ఏడాది జనవరి నుంచి పెరగాల్సి డీఏ..మార్చ్ నెల నుంచి పెరగవచ్చని తెలుస్తోంది. అంటే జనవరి, ఫిబ్రవరి ఎరియర్లతో కలిపి మార్చ్ జీతంలో పెద్దమొత్తంలో డబ్బులు చేతికి అందనున్నాయి. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ పెంపు అమలవుతోంది. గత ఏడాది చివరి సారిగా జూలైలో పెంచాల్సిన డీఏ అక్టోబర్ నుంచి పెరిగింది. అప్పటి వరకూ 42 శాతం ఉన్న డీఏ 4 శాతం పెరగడంతో 46 శాతమైంది. ఇప్పుడు మరో 4 శాతం పెరిగి 50 శాతానికి డీఏ చేరనుంది. వేతన చట్టం నిబంధనల ప్రకారం డీఏ 50 శాతానికి చేరినప్పుడు అప్పటివరకూ పెరిగిన డబ్బుల్ని కనీస వేతనానికి జత చేస్తారు. అంటే కనీస వేతనం 18 వేలుగా పరిగణిస్తే డీఏ రూపంలో ఒకేసారి 9000 రూపాయలు కనీస వేతనానికి కలపడంతో ఉద్యేగుల జీతం భారీగా 27 వేల రూపాయలు కానుంది. ఆ తరువాత డీఏ తిరిగి 27 వేలపై లెక్కించడం మొదలౌతుంది. 


అంటే ఇక నుంచి కనీస వేతనం, డీఏ రెండూ భారీగా పెరగనున్నాయి. డీఏ పెంపుతో 48.67 లక్షలమంది ఉద్యోగులు, 67.95 లక్షలమంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. అటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగదులకు డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంది. ఏఐసీపీఐ ఏడాది ఇండెక్స్ ఆధారంగా డీఏ, డీఆర్ రెండూ పెరగనున్నాయి. 2024 జనవరి నుంచి 4 శాతం డీఏను పెంచింది పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం. 


Also read: Rain Alert: ఉపరతల ఆవర్తనం ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook