7th Pay Commission Laest Updates, Central Govt Employees to get Fitment Factor Soon: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ఉద్యోగులకు శుభవార్త త్వరలోనే తీపి కబురు అందనుంది. వచ్చే ఏడాది 7వ వేతన సంఘం కింద కేంద్ర ఉద్యోగుల వేతనాల్లో పెద్ద మార్పు ఉండొచ్చని సమాచారం తెలుస్తోంది. ఫిట్‌మెంట్ పెరగడంతో ఉద్యోగుల జీతం కూడా పెరగబోతోందన్న విషయం తెలిసిందే. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచాలని కేంద్ర ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తోన్న సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 38 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) అందుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కనీస వేతనం రూ.18 వేలు. దీనిని రూ.26000కు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందట. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.


ఇదే నిజమైతే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కింద 52 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ఉద్యోగుల కనీస వేతనం పెరుగుతుంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు 2.57 శాతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తున్నారు. దీన్ని 3.68కు పెంచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2.57 నుంచి 3.68కి పెంచితే.. కనీస వేతనం 18 వేల నుంచి 26 వేలకు పెరుగుతుంది.


అంతకుముందు సెప్టెంబర్ 28న కేంద్ర ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో డీఏ 34 ఉండగా.. 38 శాతానికి పెరిగింది. 2022  జూలై 1 నుంచి ఉద్యోగులు మూడు నెలల డియర్‌నెస్ అలవెన్స్‌ బకాయిలను పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన తర్వాత అనేక రాష్ట్ర ప్రభుత్వాలు డీఏను పెంచుతున్నట్లు ప్రకటించాయి. 


Also Read: IND vs SA: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!


Also Read: Kohli's Room Video Leak: విరాట్ కోహ్లి హోటల్ రూమ్ వీడియో లీక్.. నెట్టింట వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook