7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డీఏ పెంపు ప్రకటనతో సంతోషంగా ఉన్నారు. ఇటీవల నాలుగు శాతం డీఏ పెంచుతున్నట్లు కేంద్ర ప్రకటించగా.. ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగాయి. ఈ డీఏ పెంపు ప్రకటన జనవరి నెల నుంచి వర్తించనుంది. గతంలో 38 శాతం ఉండగా.. తాజా పెంపుతో 42 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజునే 4 శాతం డీఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నుంచి రాష్ట్ర ఉద్యోగులకు 7వ వేతన సంఘం కింద 42 శాతం డియర్‌నెస్ అలవెన్స్ అందించనుంది. దీంతో పాటు రాష్ట్రంలోని పెన్షనర్లకు కూడా అదే డియర్‌నెస్ రిలీఫ్ లభిస్తుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ మేరక్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం ఉద్యోగులను బాగా చూసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 4 శాతం పెంచిందని ప్రకటించడం సంతోషంగా ఉందని చెప్పారు. పెన్షనర్ల కొత్త డీఏ, డీఆర్‌లు 42 శాతానికి చేరిందని ఆయన చెప్పారు. ఉద్యోగి బేసిక్ పే నెలకు రూ.23,500 అయితే.. డీఏ 42 శాతంతో రూ.9,870 అవుతుంది. ఇది గత డియర్‌నెస్ అలవెన్స్ కంటే నెలకు రూ.940 ఎక్కువ. ఏప్రిల్ 10వ తేదీన ఉద్యోగుల ఖాతాలో నగదు జమకానుంది.


 




అస్సాం సర్వీసెస్ రూల్స్ 2017 ప్రకారం డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ రివిజన్ చేసింది. తాజాగా పెంచిన డియర్‌నెస్ అలవెన్స్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నెలకు అదనంగా రూ.79.57 కోట్లు జమ చేస్తోంది. రాష్ట్రంలో బిహు పండుగకు సన్నాహాలు ప్రారంభమయ్యే ముందు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించడం విశేషం. దీంతో పాటు రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది సంవత్సరానికి 1,988 MU శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేంద్రం యాక్ట్ ఈస్ట్ పాలసీని వేగవంతం చేస్తుంది.


Also Read: LSG vs DC: లక్నో Vs ఢిల్లీ జట్ల మధ్య టఫ్‌ వార్.. ప్లేయింగ్ 11 ఇదే..!  


Also Read: PBKS Vs KKR: ఐపీఎల్‌లో మరో బిగ్‌ఫైట్.. పంజాబ్ Vs కోల్‌కత్తా హెడ్ టు హెడ్ రికార్డులు.. పిచ్ రిపోర్ట్ ఇదే..   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి