Central Govt Gave Update on 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈ ఏడాది డీఏ పెంపు ప్రకటనకు ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెర పడనుంది. కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచబోతోంది. శుక్రవారం ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తరువాత డీఏ పెంచుతున్నట్లు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగులు డీఏ పెంపు ద్వారా ప్రత్యక్షంగా లబ్ధి పొందనుండగా.. మోదీ సర్కారు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి బుధవారమే కేంద్ర కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 38 శాతం డీఏ అందుకున్నారు. 4 శాతం పెంచితే.. 42 శాతానికి చేరుకుంటుంది. పెంపు ప్రకటన తరువాత ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపుదల ఉంటుంది. జనవరి నెల నుంచి డీఏ కలిపి మొత్తం ఒకేసారి ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తారు.
 
42 శాతం చొప్పున డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుందంటే..?


కనీస ప్రాథమిక వేతనంపై లెక్కింపు ఇలా..


==>> ఉద్యోగి బేసిక్ శాలరీ–రూ.18 వేలు
==>> కొత్త డీఏ (42 శాతం)–నెలకు రూ.7,560
==>> ప్రస్తుత డీఏ (38 శాతం)–నెలకు రూ.6,840
==>> ఎంత డీఏ పెరగనుంది-నెలకు రూ.720 (రూ.7,560-రూ.6,840)
==>> వార్షిక జీతంలో పెంపు -720X12= రూ.8,640


గరిష్ట జీతం స్థాయిలో ఇలా..


==>> ఉద్యోగి బేసిక్ శాలరీ- రూ.56,900
==>> కొత్త డీఏ (42 శాతం)- రూ.23,898/నెల
==>> ఇప్పటివరకు ఉన్న డీఏ (38 శాతం)- రూ.21,622/నెల
==>> ఎంత డీఏ పెరిగింది-23898-21622 =రూ.2276/నెల
==>> వార్షిక జీతంలో పెరుగుదల -2276X12= రూ.27,312


మరోవైపు కరోనా సమయంలో పెండింగ్‌లో ఉంచిన 18 నెలల డీఏ చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్థిక సమస్యల కారణంగా బకాయిలను విడుదల చేయడం సాధ్యంకాదని లోక్‌సభలో స్పష్టం చేసింది. కరోనా కాలంలో ఉద్యోగుల డీఏ నుంచి రూ.34,402.32 కోట్లు ఆదా చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ డబ్బును కోవిడ్ మహమ్మారిని అరికట్టడానికి ఉపయోగించినట్లు వెల్లడించారు. జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 డీఏలను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. జూలై 2021లో డీఏ పెంపును ప్రారంభించింది.


Also Read: PF Account: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మీ అకౌంట్ చెక్ చేసుకోండి


Also Read: Loan Costly: కస్టమర్లకు షాకిచ్చిన మరో బ్యాంక్.. ఈఎంఐలపై భారీ మోత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి